Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఇక మహేష్ బాబు అభిమానుల సంగతి చెప్పనవసరం లేదు. ‘వారణాసి’ ఎప్పుడొచ్చినా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించడం ఖాయం అని వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. మిగతా సినిమాలకి చేసినట్టు ‘వారణాసి’ సినిమా కోసం వాళ్ళు అప్డేట్లు వంటివి డిమాండ్ చేయడం లేదు. చాలా ఓపికగా ఉంటున్నారు.

Mahesh Babu

ఎటొచ్చీ మహేష్ బాబు అభిమానులు ఒక విషయంలో మాత్రం క్లారిటీ లేక కంగారు పడుతున్నారు. అదే మహేష్ బాబు 30 వ సినిమా అంటే.. ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమాకి దర్శకుడు ఎవరు అని..! ఆ ప్రశ్నకి మాత్రం ఇంకా జవాబు దొరకలేదు. కానీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘పెద్ది’ రిలీజ్ అయ్యాక దర్శకుడు బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుకి ఓ కథ వినిపించినట్టు చెప్పుకొచ్చారు.

సొ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలో ఏషియన్ సునీల్ నిర్మాణంలో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఉంటుందని.. దానికి సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తారంటూ ఇంకో ప్రచారం మొదలైంది. దీంతో మళ్ళీ మహేష్ అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేస్తున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలి అలాగే రణబీర్ కపూర్ తో ‘యానిమల్ పార్క్’ కూడా చర్చల్లో ఉంది. సొ ఇది కూడా సెట్ అయ్యే ప్రాజెక్టు కాదు.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని మహేష్ బాబు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘గుంటూరు కారం’ తర్వాత ఈ కాంబోలో సినిమా ఉంటుంది అనే ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడు ‘వారణాసి’ వంటి లార్జ్ స్కేల్ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తుంది. అనిల్ వినిపించిన కథ ప్రకారం.. ఆ ప్రాజెక్టు స్పొర్ట్స్ నేపధ్యంలో సాగుతుందట. మహేష్ కోచ్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus