రకుల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు : రాహుల్ రవీంద్రన్
- April 19, 2019 / 05:17 PM ISTByFilmy Focus
కెరీర్లో ఒక్క హిట్టు లేని సుశాంత్ కు ‘చి ల సౌ’ లాంటి డీసెంట్ హిట్టిచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఈ చిత్రాన్ని ఆయన డీల్ చేసిన విధానం నిజంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. సుశాంత్ తోనే మంచి పెరఫార్మసి చేయించి శభాష్ అనుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ డైరెక్టర్ కు తిరుగులేదనుకున్నాడో ఏమో.. తన కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ అనిపించుకున్న ‘మన్మధుడు’ కే సీక్వెల్ చేసే అవకాశాన్ని కట్టబెట్టాడు నాగార్జున. ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు.
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అయితే రకుల్.. ఓ హిందీ చిత్రం కోసం బాగా సన్నబడిపోయింది. ఈ లుక్ నాగ్ కు నచ్చలేదంట. రకుల్ కాస్త ఒళ్ళు చేసే వరకూ తన సీన్లు పెండింగ్లో ఉంచమని నాగార్జున డైరెక్టర్ రాహుల్ చెప్పినట్టు గత కొంతకాలంగా వార్తలొచ్చాయి. ఈ వార్తలను రాహుల్ రవీంద్రన్ ఖండించాడు. ‘రకుల్‌తో ఎలాంటి ఇబ్బందులూ లేవని స్పష్టం చేశాడు. షూటింగ్ ప్రారంభమైన రోజు నుండీ రకుల్ యూనిట్‌తోనే ఉంది. ఆమె గొప్ప ట్యాలెంట్ ఉన్న నటి. సినిమా చాలా బాగా వస్తుంది’ అంటూ రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.













