ప్రియమణి చెప్పనున్న గుడ్ న్యూస్ అదేనా..!

  • July 31, 2018 / 03:19 PM IST

పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో తెలుగు వారికి దగ్గరైన ప్రియమణి.. తర్వాత అనేక సినిమాల్లో నటించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేసింది. మణిరత్నం వంటి దర్శకుల సినిమాల్లోనూ నటించింది. అయితే ఏది పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో బుల్లి తెరకి వెళ్లిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. తెలుగులో డీ 10 డాన్స్ షోకి కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అయితే తాజాగా ఆమె తన భర్త తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని పోస్ట్ చేసింది.

ఈమె సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ నిర్వహిస్తున్న ముస్తఫారాజ్ ని ప్రేమించింది. వీరిద్దరికి గత ఏడాది పెళ్లిచేసుకున్నారు. అప్పటి నుంచి కలిసి ఎంతో జీవిస్తున్న ఈ దంపతులు మీడియాకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు భర్తతో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ఆసక్తికర విషయం అంటూ ఊరించడంతో నెటిజనులు ఫోటోని నిశితంగా పరిశీలించారు. ప్రియమణి తల్లి అయినట్లు భావిస్తున్నారు. అందుకే ప్రియమణి కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాను తల్లి కాబోతున్న సంగతి ప్రియమణి నోటి నుంచి వస్తే ఆమె అభిమానులు మరింత సంతోషపడుతారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus