Pushpa 2: డిసెంబర్ 4నే ప్రీమియర్స్… వర్కౌట్ అవుతుందా?

  • October 23, 2024 / 08:14 PM IST

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) పై తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా భారీ హైప్ నెలకొంది. వాస్తవానికి ఆగస్టు 15 కే ‘పుష్ప 2’ రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. డిసెంబర్ 6 కి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తర్వాత ఆ డేట్ పై కూడా బోలెడన్ని అనుమానాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ టీం వాటిని ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 6 కే రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది.

Pushpa 2

మొత్తానికి వాళ్ళు మాట ఇచ్చినట్టుగానే ‘పుష్ప 2’ షూటింగ్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది అని కొందరు అంటున్నారు.. ‘కానీ ఐటెం సాంగ్ ఇంకా షూట్ చేయలేదు, ప్యాచ్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉంది’ అనేది టీం నుండి అందుతున్న సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ‘పుష్ప 2’ టీం కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తుంది.

ఎందుకంటే ఆల్రెడీ ‘పుష్ప 2’ ని ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5నే విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు.. తమ క్లోజ్ సర్కిల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అంతే కాదు డిసెంబర్ 4 నే ప్రీమియర్స్ కూడా వేయబోతున్నారట. డిసెంబర్ 20 వరకు కొంచెం పేరున్న సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. కాబట్టి.. ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.

అందుకే మేకర్స్ రిలీజ్ ను రెండు రోజుల ముందుకు జరిపి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్టు ఉన్నారు. అయితే సుకుమార్.. రేపు సినిమా రిలీజ్ అని తెలిసినా ఈరోజు కూడా షూట్ చేసే రకం. షోలు ఏమాత్రం డిలే అయినా.. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.

మరో పెద్ద హీరోయిన్ కూడానా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus