సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా.. ఆయన చికిత్స కోసమే అమెరికా వెళ్లారంటూ ప్రచారం సాగుతోంది. అమెరికాలో రజనీకి కిడ్నీ ఆపరేషన్ జరిగిందని..అందుకే ఆయన ఒక వారం ఆలస్యంగా భారత్ కు తిరిగి రానున్నారని అంటున్నారు.
అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని రజనీకాంత్ బాగానే ఉన్నారని లైకా ప్రొడక్షన్ అధినేత రాజు మహాలింగం తెలిపారు. అదేవిధంగా తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని, యూఎస్ వీధుల్లో సరదాగా తాము తిరుగుతున్నామంటూ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను రజనీ కుమార్తె ఐశ్వర్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కాగా రజనీ ప్రస్తుతం నటిస్తున్న కబాలి చిత్రం జులై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.