చెక్ విషయంలో.. రకుల్ అలక

  • February 27, 2021 / 11:18 AM IST

గ్లామరస్ క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ చాలా కాలం తరువాత కొంచెం డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల కాలంలో ఆమె ఎప్పుడు లేని విధంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లోకి రాకపోవడానికి గల కారణం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు రకుల్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది అనే సందేహాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ గా ఉన్న వారిలో రకుల్ ఒకరు.

కొన్ని ప్లాప్స్ ల వల్ల హవా తగ్గింది గాని లేకుంటే అమ్మడు పూజా హెగ్డే, రష్మీకల రేంజ్ లో ఉండేది. ఇక ఎందుకో ఈ బ్యూటీ చెక్ సినిమా విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది. సినిమా ప్రమోషన్ లోన్స్ కాకుండా ఎంతో ముఖ్యమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా కావాలనే రాలేదని తెలుస్తోంది. అయితే రకుల్ అలక వెనుక ఉన్న కారణం దర్శకుడేనట. రకుల్ ను మొదట హైలెట్ చేస్తానని చెప్పి ఆ తరువాత ప్రియా ప్రకాష్ వారియర్ ను హైలెట్ చేసి చూపించారనే కాస్త హార్టయినట్లు సమాచారం.

అంతే కాకుండా ఆమె కోసం స్పెషల్ సాంగ్ కూడా పెట్టారని రకుల్ కాస్త అసహనానికి గురయ్యిందట. చాలా వరకు ఆమె సీన్స్ ఎడిటింగ్ లో కూడా లేపేశారాని కథనాలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus