Samantha: సమంత ప్రెగ్నెంట్ అయ్యారా.. ప్రూఫ్ ఇదేనా..?

  • June 7, 2021 / 04:12 PM IST

2017 సంవత్సరం అక్టోబర్ నెలలో సమంత నాగచైతన్య వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే సమంత ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సమంత పిల్లల్ని కంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత చైతన్య సినిమాలపై దృష్టి పెట్టి బిజీగా ఉండటంతో పిల్లల్ని కనే విషయంపై దృష్టి పెట్టడం లేదు. అయితే తాజాగా సమంత ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సమంత షేర్ చేసిన ఫోటోలో మామిడికాయ ఉండటంతో సమంత ప్రెగ్నెంట్ అయ్యారని ప్రూఫ్ ఇదేనని నిన్నటినుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. సమంత సాకీ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా గార్డెన్ లో కూర్చుని ఫోటో దిగగా ఈ తరహా ప్రచారం జరగడం గమనార్హం. మామిడికాయను చూస్తూ ఫోటో దిగడమే సమంత చేసిన తప్పు కావడం గమనార్హం. నెటిజన్ల కామెంట్లతో ఇకపై సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.

వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సమంత ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే శాకుంతలం షూటింగ్ 50 శాతం పూర్తి కాగా ఈ ఏడాది చివరినాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ వివాదం కొనసాగుతుండటం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus