రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. సలార్ సినిమా విడుదలయ్యే వరకు యానిమల్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ఈ స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడానికి ఒకే ఒక్క సీన్ కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ మాట్లాడుతూ
సినిమాలో పెళ్లి కూతురితో తప్పుగా ప్రవర్తించే సీన్, ఆ తర్వాత ఇద్దరు భార్యలను కూడా బలవంతంగా అనుభవించడానికి రమ్మనే సీన్ ఉండటం వల్లే సినిమా అంత పెద్ద హిట్ గా నిలిచిందని అన్నారు. ఇలాంటి సన్నివేశాలను ప్రోత్సహించడం తనకు నచ్చదని అయితే సినిమాలో విలన్ రోల్ గురించి చెప్పడానికి ఆ సీన్ బాగా ఉపయోగపడిందని బాబీ డియోల్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు యానిమల్ (Animal) సినిమా సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ను వేగంగా తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. యానిమల్ సినిమా కేవలం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. రణ్ బీర్ కపూర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తాయో చూడాలి.
సందీప్ రెడ్డి వంగా తర్వాత ప్రాజెక్ట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతుండటం గమనార్హం. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ అఫీసర్ గా కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి. 2025 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. 2024 చివర్లో స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.