స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన గత రెండు చిత్రాలు నిరాశపరిచాయనే చెప్పాలి. హరీష్ శంకర్ డైరెక్షన్లో చేసిన ‘దువ్వాడ జగన్నాధం – డీ జె’ చిత్రం యావరేజ్ గా నిలువగా ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సో ఈ సారి అలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడట బన్నీ. ఇప్పటి వరకూ చాలా డైరెక్టర్లు చెప్పిన కధలు వినినప్పటికీ.. కచ్చితంగా హిట్టు కొట్టాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయడమే కరెక్ట్ అని బన్నీ భావించాడు. అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. సీతారా ఎంటర్ టైన్మెంట్ మరియు గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయని కూడా తెలిసిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పటివరకూ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హీరోయిన్ ఎవరు? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేకుండాపోయింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ “ఇంకెప్పుడు మొదలవుతుందిరా బాబు” అని హడావుడి మొదలెట్టారు. అయితే.. తమ కాంబినేషన్ లో రూపొందే మూడో సినిమా కాబట్టి త్రివిక్రమ్ చాలా స్పెషల్ కేర్ తీసుకొంటున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది కానీ.. డైలాగ్ వెర్షన్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. అందుకే సినిమా రెగ్యులర్ షూట్ మొదలవ్వడంలో లేట్ అవుతూ వస్తోంది. సో, స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే షూటింగ్ మొదలవుతుందన్నమాట