‘సాహూ’ నటి భయపడిపోయిందట… కారణం అదే..!

ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, ఎవెలిన్ శర్మ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు ఈ చిత్రంలో ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎవెలిన్ శర్మ… ‘సాహూ’ షూటింగ్‌లో ఎదుర్కొన్న భయంకర అనుభవం గురించి చెప్పుకొచ్చింది.అందేంటంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ రోజు షూటింగ్ పూర్తయ్యాక ఎవెలిన్ శర్మ హోటల్‌ కి వెళుతున్నప్పుడు … అక్కడ ఓ వ్యక్తి నిలుచుని ఆమెను చూస్తున్నాడట. ఇది గమనించిన ఎవెలిన్ శర్మ భయంతో ఏం చేయాలో తెలీక వెంటనే తన రూమ్ కి వెళ్ళిపోయిందట. అసలు ఆ వ్యక్తికి ఎవెలిన్ శర్మ రూమ్ ఎలా తెలిసింది.. అసలు లోపలికి ఎలా వచ్చాడో తనకి అర్ధం కాలేదట. ఈ సంఘటన గుర్తొచ్చిన ప్రతీసారి తనకి చాలా బయమేస్తుందని చెప్పుకొచ్చింది. అయితే తన అభిమానులతో ముచ్చటించడం తనకి ఇష్టమే… కానీ ఈ విధంగా రూమ్ వరకూ రావడం కరెక్ట్ కాదని ఎవెలిన్ శర్మ తెలియజేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus