ఆ సీన్ కూడా ఉండి ఉంటే క్లారిటీ ఉండేదేమో

  • April 8, 2019 / 06:51 PM IST

మజిలీ సినిమా గతవారం విడుదలై మంచి విజయం సొంతం చేసుకొని మొదటివారంలోనే 17 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య-సమంత నటనకు మంచి అప్రిసియేషన్ రాగా.. శివ నిర్వాణ సెన్సిబుల్ డీలింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ.. అందరికీ ఉన్న ఒకే ఒక్క అసంతృప్తి మాత్రం మిగిలిపోయింది. సెకండాఫ్ లో వచ్చే ఫస్ట్ హీరోయిన్ కూతురు నాగచైతన్యకి పుట్టిన ఆమె అయితే బాగుండని, అప్పుడు కథనంలో క్లారిటీ ఉండేదని అనుకొన్నారందరూ.

అయితే.. అందరూ అనుకున్న విధంగా అది నిజమే. మీరా హీరో పూర్ణ కూతురే. అన్షు చివరిసారిగా పూర్ణని వదిలి వెళ్ళేప్పుడు హోటల్లో అతడితో రమిస్తుంది. ఆ క్రమంలోనే వేరే వ్యక్తితో పెళ్ళైన తర్వాత మీరాకు జన్మనిస్తుంది. అయితే.. ఈ స్టోరీ ఎక్కడ “క్షణం” క్లైమాక్స్ ను గుర్తుకు తెస్తుంది అనే భయంతో ఆ సన్నివేశాన్ని ఎడిట్ చేసి.. పూర్ణ కూతురే మీరా అనే విషయాన్ని ఎక్కడా బయటపడనివ్వకుండా స్క్రీన్ ప్లే పరంగానూ జాగ్రత్తపడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus