అక్కినేని యువ హీరో నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఈయన నటించిన సినిమాలేవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదనిపించుకున్నప్పటికీ ఈ సినిమా అనంతరం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా అనంతరం బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా ఎలాంటి సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ విధంగా నాగచైతన్య నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఈయన కూడా డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సినిమాకి కూడా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించడం విశేషం.
ఈ సిరీస్ లో మొదటిసారిగా నాగచైతన్య నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ ఆమెజాన్ మాత్రం ఈ వెబ్ సిరీస్ విడుదల చేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత అమెజాన్ ఈ వెబ్ సిరీస్ విడుదల చేయకపోవడానికి ఓ కారణముందని సమాచారం.
ప్రస్తుతం వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఇద్దరు కూడా ఫామ్ లో లేరు ఇలాంటి సమయంలో వెబ్ సిరీస్ విడుదల చేసినప్పటికీ ఈ వెబ్ సిరీస్ పై పెద్దగా బజ్ ఏర్పడదని,అందుకే మరి కొంతకాలం పాటు ఈ వెబ్ సిరీస్ విడుదల చేయకుండా వాయిదా వేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అందుకే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మరి కాస్త ఆలస్యం కానుంది అని తెలుస్తోంది.