సోషల్ మీడియాలో కనిపించేది అంతా నిజం కాదు. ఈ మాట ఎంత చెప్పినా మళ్లీ అదే మాట నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే నెటిజన్ల నైజం అంతే. ఇలాంటి విషయాల కోసమే ఫ్యాక్ట్ చెక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో కనిపించే విషయాల్ని నమ్మొద్దంటూ చెక్ చేసి చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఈ వార్త. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్న అతి పెద్ద చర్చకు ఓ తీర్పు ఇచ్చేసేలా ఆ వీడియోను టైమ్ చూసి వదిలారు కొంతమంది నెటిజన్లు.
ఎగ్జిబీటర్లు – నిర్మాతల గొడవల్లో బాగా నలిగిన పేర్లు యువ నిర్మాత నాగవంశీ, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్. థియేటర్ల పంచాయితీ తేల్చడానికి మీటింగ్ పెట్టుకుంటే అందులో నాగవంశీని సునీల్ నారంగ్ ఏదో అన్నారు అని వార్తలు బయటకు వచ్చాయి. తొలి రోజుల్లో ఈ విషయాన్ని ఎవరూ కన్‌ఫామ్ చేయకపోయినా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఆ విషయంలో తన నుండి సరైన సమయంలో, సరైన రెస్పాన్స్ ఉంటుందని చెప్పారు.
అయితే, ఆ వెంటనే సోషల్ మీడియాలో ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ ఫంక్షన్‌కి నాగవంశీ హాజరయ్యారు. ఆ వేదిక మీద నిర్మాత సునీల్ నారంగ్ ఉండగా.. నాగవంశీ స్టేజీ పైకి వచ్చారు. రాగానే నారంగ్‌కి నమస్కారం పెట్టి, ఫొటోకి పోజిచ్చారు. ఈ వీడియోను చూసి నిన్నటి వరకు మాటా మాటా అనుకొని ఇలా కలసిపోయారు చూశారా అంటూ ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు. ఆ వీడియోను గతేడాదిది.
అప్పటికి.. ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు తూటాలు, భేదాభ్రిపాయాలు లేవు. కాబట్టి ఆ సమయంలో అలా ఉండటం తప్పేమీ లేదు. అయినా మాటా మాటా అనుకున్నారని.. ఎదురుపడితే గొడపడతారా ఏంటి. ఏదైనా ఆ వీడియో ఇప్పటిది కాదు అనేది ఆఖరి మాట.