Tiger Shroff: టైగర్ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?
- October 26, 2026 / 04:44 PM ISTByFilmy Focus Desk
బాలీవుడ్ కథానాయకుడు టైగర్ ష్రాఫ్‌పై ఇటీవల ముంబయిలో కాల్పులకు దుండగలు పాల్పడిన విషయం తెలిసిందే. దీని వెనుక కారణం ఇదీ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ని టైగర్ పొగడటం వల్ల టైగర్‌పై దాడి జరిగింది అని ఈజీగా చెప్పేయొచ్చు. అయితే ఎప్పుడు పొగిడాడు అనేది ఇప్పుడు ఆ వీడియోలో తెలుస్తోంది. అయితే ఆ ఘటన నాలుగేళ్ల క్రితం జరగడం గమనార్హం. అంటే అప్పుడెప్పుడో మాట్లాడిన మాటల నేపథ్యంలో ఇప్పుడు దాడి జరిగిందన్నమాట.
Tiger Shroff
ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ గురించి టైగర్ మాట్లాడుతూ టైగర్ అనే పేరు ఎంత మందికైనా ఉండొచ్చు. కానీ, ఇండస్ట్రీలో ఒక్కరే టైగర్. ఆయనే సల్మాన్ ఖాన్ అని వ్యాఖ్యానించాడు. ఆ కారణంగానే టైగర్ ష్రాఫ్‌పై దాడికి పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్లు ముంబయి మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో సల్మాన్‌ను ఇప్పటివరకు ఎవరెవరు పొగిడారు అనే విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు కాల్పుల ఘటన తర్వాత టైగర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌ను రూ.9 కోట్లకు అమ్మేశారు. కాల్పలు ఘటన జరిగిన రోజు (అక్టోబర్ 18న) నుండి నాలుగు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 22న ఈ ఫ్లాట్ లావాదేవీ రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు. దీంతో భద్రత దృష్ట్యానే టైగర్ ఆ ఇంటిని అమ్మేశారు అని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అసలేమైందంటే.. అక్టోబర్ 18న జుహు ప్రాంతంలోని ఓ ఫుట్‌బాల్ మైదానం నుండి టైగర్ కారులో వెళుతుండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన డ్రైవర్, ఉమేశ్ అనే ఓ అభిమాని గాయపడ్డారు. ఇక రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ వద్ద రైలులో ఉన్న సమయంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.












