Liger Movie: ‘లైగర్‌’ కోసం పూరి భారీ ప్లాన్స్‌!

  • June 18, 2021 / 01:23 PM IST

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే కాదు, పూరి జగన్నాథ్‌ కెరీర్‌లోనూ ‘లైగర్‌’ చాలా పెద్ద సినిమా. ఎందుకంటే ఇద్దరికీ ఇదే తొలి పాన్‌ ఇండియా సినిమా. ఇది విజయం సాధిస్తే… ప్రభాస్‌లా పాన్‌ ఇండియా సినిమాలతో బిజీ అయిపోవచ్చు. అందుకే పూరి ఈ సినిమా కోసం ఎప్పుడూ లేనిది ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నాడు. 40 – 60 రోజుల్లో సినిమాను పూర్తి చేసే పూరి… ఏడాది దాటినా ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు భారీ అట్రాక్షన్‌ను యాడ్ చేయాలని చూస్తున్నాడట.

‘లైగర్‌’ సినిమా కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలోని సినిమా అనే విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో కిక్‌ బాక్సింగ్‌నే హైలైట్‌ చేశారు. దీంతోపాటు ఈ సినిమాకు ఇంకా కిక్‌ బాక్సింగ్‌ ఫ్లేవర్‌ రావాలని ఏకంగా ప్రముఖ కిక్‌ బాక్సింగ్‌ ప్లేయర్‌ మైక్‌ టైసన్‌ను రంగంలోకి దింపాలని చూస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి టైసన్‌ టీమ్‌ను కాంటాక్ట్‌ అయ్యారని తెలుస్తోంది. అయితే అటువైపు నుండి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియాల్సి ఉంది. అయితే ఇండియా సినిమా చేయడానికి టైసన్‌ ఆసక్తి చూపిస్తారా? ఒకవేళ ఓకే అంటే… అంత రెమ్యూనరేషన్‌ కరణ్‌ జోహార్‌ ఇస్తారా అనేది ఇక్కడ ప్రశ్న.

గతంలోనూ టైసన్‌ను ఇండియన్‌ మూవీలో యాక్ట్‌ చేయించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు పూరి – కరణ్‌ టీమ్‌ ఏం చేస్తారో చూడాలి. అయితే టైసన్‌ పేరును వాడుకొని హైప్‌ తెచ్చుకునే ప్రయత్నమా ఇదీ… అంటే ఏమో చెప్పలేం. గతంలో ‘ఐ’సినిమా విషయంలో శంకర్‌ ఇలాంటి పనే చేశాడు. సినిమాలో ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌ ఉంటారు అని ప్రచారం చేశారు. ఆఖరికి ఆడియో ఫంక్షన్‌కి కాసేపు ఆర్నాల్డ్‌ను కాసేపు తీసుకొచ్చి.. హడావుడి చేశారు. మరిప్పుడు పూరి ఏం చేస్తారో చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus