Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇసకపట్నం’ (Isakapatnam) వెబ్ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. జూలై 2 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సముద్రఖని అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య వంటి క్రేజీ ఆర్టిస్టులు కూడా నటించారు. మొదటి రోజు నుంచే ఈ సిరీస్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది.

Isakapatnam

మొదటి 3 ఎపిసోడ్లలో క్యారెక్టర్లను, వరల్డ్ ను పరిచయం చేసిన తీరు వీక్షకుల దృష్టిని ఆకర్షించి అటెన్షన్లోకి తీసుకొచ్చింది అంటున్నారు. ఆ తర్వాతి ఎపిసోడ్లలో డ్రామా బాగా పండిందని, చివరి 3 ఎపిసోడ్లు ట్విస్ట్‌లు, టర్న్‌లతో పాటు గ్రిప్పింగ్ నెరేషన్‌తో కట్టిపడేసేలా ఉందని ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో మొదటి వీకెండ్ మొత్తం ఈ సిరీస్ దేశవ్యాప్తంగా టాప్-3లో ట్రెండ్ అయ్యింది.టాలీవుడ్ సెలబ్రిటీలను సైతం ఈ సిరీస్ ఆకర్షించింది.

నాగ చైతన్య, హరీష్ శంకర్, తేజ సజ్జా వంటి స్టార్స్ ‘ఇసకపట్నం’ (Isakapatnam) సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వీక్ డేస్‌లో కూడా దీని రీచ్ మరింత పెరిగిందని చెప్పాలి. ‘ఇసకపట్నం’ సిరీస్ ఇప్పుడు ఇండియా వైడ్ టాప్-2లో ట్రెండ్ అవుతోంది. నిజంగా ఇది హ్యూజ్ జంప్ అనే చెప్పాలి. సాధారణంగా వీక్ డేస్‌లోకి ఎంటర్ అయ్యాక రీచ్ తగ్గాలి. కానీ ఇప్పుడు ఏకంగా టాప్-2కు చేరుకుందంటే.. రాబోయే రోజుల్లో ‘ఇసకపట్నం’ మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus