Rama Rao Movie: రవితేజ ‘కొత్త ’ సినిమా టైటిల్‌ ఎంత పని చేసిందో చూశారా!

Advertisement

ఒక హీరోకు చెప్పిన కథ మరో హీరోకు వెళ్లడం, ఒక హీరోతో సినిమా తీస్తా అనుకున్న దర్శకుడు వేరే హీరోతో తీయడం చాలా సర్వసాధారణం. ఏదో కారణంతో ఆ సినిమా పక్కకు వెళ్లిపోతుంది. అయితే ఒక హీరోకు అనుకున్న టైటిల్‌ వేరే హీరో సినిమాకు పెట్టేయడం చాలా అరుదు. గతంలో ఎప్పుడో ఇలా జరిగింది అని విన్నాం. అయితే ఇప్పుడు రవితేజ కొత్త సినిమా టైటిల్‌తో ఆ చర్చ మళ్లీ బయటికొచ్చింది.

‘రామారావు’ అంటూ… రవితేజ సినిమాకు ఇటీవల పేరు పెట్టారు. ఆ పోస్టర్‌ విడుదల చేసింది మొదలు రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తొలుత ఈ టైటిల్‌ను బాలకృష్ణ – అనిల్‌ రావిపూడి సినిమాను అనుకున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమానే ఇంకా ఓకే కాలేదు కాబట్టి ఆ పేరు అనుకున్నారని అని చెప్పలేం. అయితే ఇప్పుడు బాలయ్య టైటిల్‌ రవితేజ లాగేసుకున్నాడని అంటూ చర్చ మొదలుపెట్టారు.

ఈ టైటిల్‌ రచ్చ ఇక్కడితో ఆగిపోతే బాగుండు. అయితే దీనికి ఎప్పుడో జరిగింది అని చెబుతున్న ఓ సంఘటనను ముడిపెడుతున్నారు కొందరు. ఓ సినిమా షూటింగ్‌ సందర్భంలో జరిగిన ఓ సంఘటన కారణంగా బాలయ్య.. రవితేజపై కోప్పడ్డారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ కోపంతోనే బాలయ్య టైటిల్‌ను రవితేజ ఇప్పుడు పెట్టేశారని అంటున్నారు. అయినా అప్పుడెప్పుడో జరిగిందో, జరగలేదో తెలియని విషయాన్ని ఇప్పుడు ‘రామారావు’పై ఎందుకు రుద్దుతున్నారో మరి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus