ఆ సీనియర్ నటికి షాకిచ్చిన ఐటీ అధికారులు..!

మొన్నటికి మొన్న సీనియర్ హీరోయిన్లైనా రాశీ,రంభ లు చేస్తున్న వాణిజ్య ప్రకటన నిలిపివేయాలంటూ కోర్టు.. నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరు చేసే ప్రకటనలు తప్పుదారి పట్టిస్తున్నాయని విజయవాడ కు చెందిన ఓ కస్టమర్ కేసు వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు నటి రాశి ఇంటి పై ఐటీ దాడులు జరగడం కూడా పెద్ద సంచలనమైంది. రాశి పైన మాత్రమే కాదు ఆమె సోదరుడు `కలర్స్` సంస్థ అధినేత అయిన విజయ్ కృష్ణ పై కూడా ఐటీ అధికారులు సోదా చేశారు.

ఆర్థిక వ్యవహారాలు పన్ను చెల్లింపు విషయంలో తేడా రావడం వల్లనే ఇలా రైడ్ లు చేస్తున్నట్టు వారు చెప్పుకొస్తున్నారు. వీరి ఇళ్ళ తో పాటు.. ‘కలర్స్’ కు సంబందించిన బ్రాంచ్ లన్నిటిలోనూ రైడ్ లు నిర్వహించినట్టు తెలుస్తుంది. తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ‘కలర్స్’ బ్రాంచ్ లలో కూడా ఈ రైడ్ లు జరుగాయట. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించిన 49 బ్రాంచీలు.. 1500 మంది డైటీషియన్లు- థెరపిస్టులు ఇందులో పని చేస్తున్నారట. 10లక్షల మంది కస్టమర్లు ఉన్నారని సమాచారం.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus