Suriya, Prabhas: టాలీవుడ్‌ – కోలీవుడ్‌ పోరులో ఏం జరుగుతుంది..!

  • March 7, 2022 / 12:31 PM IST

రెండు సినిమాలను కంపేర్‌ చేయడం అంత ఈజీగా కాదు. అందులో స్టార్‌ హీరోల సినిమాల కంపేరిజన్‌ దాదాపు అసాధ్యం. అలాంటి రెండు సినిమాల మధ్య పోటీ పడితే భలే రంజుగా ఉంటుంది. దేనికదే గొప్ప సినిమా అవ్వడంతో ప్రేక్షకులు కూడా ఆ వార్‌ను వినోదంలా చూస్తారు. అలాంటి వార్‌ను గత నెలాఖరులో చూశాం. అదే ‘వలిమై’ వర్సెస్‌ ‘భీమ్లా నాయక్‌’. తెలుగు విషయానికొస్తే ఈ వార్‌లో ‘భీమ్లా నాయక్‌’ గెలిచాడు. ఇప్పుడు మరో వార్‌ సిద్ధమవుతోంది.

ఒకే డేట్‌కి లేదంటే ఒకే సీజన్‌లో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు వస్తే కాస్త ఇబ్బందే. దీంతో చాలావరకు రాకుండా చూసుకుంటున్నారు టాలీవుడ్‌ నిర్మాతలు. అయితే తెలుగు – తమిళ హీరోల సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. బాక్సాఫీసు దగ్గర పోటీపడుతున్నాయి. ముందుగా చెప్పినట్లు శివరాత్రి సీజన్‌కి అలా అజిత్‌ ‘వలిమై’, పవన్‌ కల్యాణ్‌ – రానా ‘భీమ్లా నాయక్‌ పోటీ పడ్డాయి. 24న ‘వలిమై’ రాగా, 25న ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్‌ అయ్యాయి.

తెలుగు వరకు చూస్తే ‘భీమ్లా నాయక్‌’ బంపర్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ‘వలిమై’ ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో మొన్నటి పోరులో టాలీవుడ్‌ భారీ విజయం సాధించింది. ఇప్పుడు అలాంటి పోరే జరగబోతోంది. ఈసారి పోటీదారులు ప్రభాస్‌ – సూర్య. ప్రభాస్‌ నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న విడుదలవుతోంది. ఇక సూర్య నటించిన ‘ఈటి’ మార్చి 10న వస్తోంది. దీంతో బాక్సాఫీసు దగ్గర మరో ఆసక్తికర పోరు పక్కా అని అంటున్నారు.

రెండు సినిమాల మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఎవరేం చేస్తారో చూడాలి. ‘రాధేశ్యామ్‌’ సంగతి చూస్తే ఎప్పటి నుండో వాయిదా పడుతూ పడుతూ ఇప్పటికి విడుదలవుతోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఇక ‘ఈటి’ (ఎవరికీ తలవంచడు) సంగతి చూస్తే… పాండి రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. చూద్దాం ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో. రెండు టీమ్స్‌కి ఆల్‌ ది బెస్ట్‌.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus