మహేష్ తో సినిమా చేయడానికి పదేళ్లు ఎదురుచూసిన మురుగదాస్
- August 21, 2017 / 11:13 AM ISTByFilmy Focus
స్టార్ కాంబినేషన్ సెట్ కావడం ఎంత కష్టమో స్పైడర్ సినిమా గురించి తెలుసుకుంటే అర్ధమవుతుంది. మహేష్ తో సినిమా చేయాలనీ మురుగదాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. పదేళ్ల క్రితమే మూవీ చేయాలనీ ఇద్దరు కలిశారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు కుదిరింది. ఆశ్చర్యంగా అంది కదూ .. ఇది నిజం. ఈ విషయాన్నీ స్వయంగా మురుగదాస్ చెప్పారు. మహేష్ కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఇన్నేళ్లు పట్టిందని డైరక్టర్ వెల్లడించారు. ఇన్నేళ్ల ఎదురుచూపు తర్వాత తెరకెక్కించే మూవీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు.
ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఆ పాటను లండన్లో ప్లాన్ చేశారు. ఈనెల 23 నుంచి రొమేనియా(యూరప్)లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. ఈ పాటకు శోభి కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ తో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దసరా పండుగని పురస్కరించుకొని సెప్టెంబర్ 27 న స్పైడర్ ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














