Faima: అనారోగ్యానికి గురైన ఫైమా.. ఆందోళనలో ఫ్యాన్స్!

బుల్లితెర లేడి కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో ఫైమా ఒకరు. పటాస్ కార్యక్రమంలో ద్వారా బుల్లితెరకు పరిచయమైనటువంటి ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా సందడి చేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పాలి. ఫైమా కామెడీ పంచ్ డైలాగులకు ప్రతి ఒక్కరు కూడా ఈమెకు అభిమానులుగా మారిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి

ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో తనకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం కల్పించారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి ఫైమా సుమారు 12 వారాలపాటు హౌస్ లో కొనసాగి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విధంగా స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ వచ్చారు..

ఇక ఫైమాకు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫైమా షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ వీడియో చూసినటువంటి ఫ్యాన్స్ మాత్రమే ఏమైంది ఫైమా కు అంటూ కంగారు పడుతున్నారు.

ఇందులో భాగంగా ఈమె (Faima) చేతికి సెలైన్ బాటిల్ పెట్టించుకుని ఆసుపత్రి బెడ్ పై అలా పడి ఉండడం చూసి అభిమానులు ఏమైంది ఫైమా కు ఎందుకు ఆసుపత్రిలో ఉన్నారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు వీడియోలను షేర్ చేసినటువంటి ఈమె తనకు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తూ తొందరగా మీరు కోలుకోవాలని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags