Jabardasth Faima: ప్రవీణ్, ఫైమా విడిపోవడం వెనుక అసలు రీజన్స్ ఇవేనా?

జబర్దస్త్, బిగ్ బాస్ ఇతర షోల ద్వారా ఫైమా గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైమా (Faima), ప్రవీణ్ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకుంటారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే గత కొంతకాలంగా ఫైమా, ప్రవీణ్ ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు లేవు. అయితే ప్రవీణ్ తో బ్రేకప్ కు సంబంధించి ఫైమా నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైమా ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టీవీ షోలలో కనిపించే జోడీలేవీ రియల్ జోడీలు కావని ఫైమా అన్నారు. నన్ను, ప్రవీణ్ ను ఆన్ స్క్రీన్ లో జోడీగా చూపించడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. మా జంటను ప్రేక్షకులు ఆదరించారని ఫైమా తెలిపారు. దాన్ని వాడుకుంటూ మేము కూడా యూట్యూబ్ లో వీడియోలు చేయడం జరిగిందని ఫైమా అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ కు, నాకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయని ఆమె తెలిపారు.

మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను చెప్పుకోలేమని ఫైమా పేర్కొన్నారు. సమస్యల వల్లే మేము దూరం కావాల్సి వచ్చిందని మేము కనీసం మాట్లాడుకోవడం లేదని ఫైమా తెలిపారు. మా మధ్య జరిగిన గొడవను అందరి ముందు చెప్పుకొని పెద్దది చేయాలని అనుకొవడం లేదని ఆమె అన్నారు. గతంలో మా రిలేషన్, అండర్ స్టాండింగ్ అంతా బాగుండేదని ఫైమా పేర్కొన్నారు.

ప్రవీణ్ కు పేరెంట్స్ లేకపోవడంతో అతను మీడియా ముందు చేస్తున్న కామెంట్లు సింపథీకి దారి తీస్తున్నాయని ఆమె అన్నారు. ప్రవీణ్ పై నేను నిందలు వేయడం లేదని ప్రవీణ్ ఏం చెప్పినా సింపథీతో నన్ను నెగిటివ్ చేస్తున్నారని ఫైమా వెల్లడించారు. దయచేసి మా బంధానికి ఎవరూ పేరు పెట్టకండని ఆమె పేర్కొన్నారు. ఫైమా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus