జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న సత్యశ్రీ పలు సినిమాల్లో కీలక పాత్రలో మెరిశారు. జబర్దస్త్ సత్యశ్రీ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. జబర్దస్త్ షో ద్వారా సంపాదించిన డబ్బులు మా సిస్టర్ కోసం ఖర్చు చేశానని సత్యశ్రీ అన్నారు. మా సిస్టర్ ఎల్ అండ్ టీలో జాబ్ సంపాదించి పూణేలో పని చేస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు. కొడుకునైతే ఎలా బాధ్యత తీసుకుంటానో అలా ఇప్పుడు కూడా బాధ్యతలు తీసుకున్నానని సత్యశ్రీ అన్నారు.
పెళ్లి అనేదానిపై ఇప్పుడు ఆసక్తి లేదని నా చెల్లి పెళ్లి మొదట చేసి తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపారు. నా చెల్లికి కూడా మొదట పెళ్లి చేసుకోవడం ఇష్టమనేని సత్యశ్రీ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను, నా సిస్టర్ టామ్ అండ్ జెర్రీలా ఉంటామని ఆమె కామెంట్లు చేశారు. నాకు నచ్చినవే నా చెల్లికి కావాలని సత్యశ్రీ అన్నారు. రేపు నా భర్తే కావాలంటే కష్టం కదా అని సత్యశ్రీ వెల్లడించారు.
పెళ్లి చేసుకుని భర్త షరతులు విధిస్తే ఇబ్బంది పడాలని నన్ను రూల్ చేస్తే నాకు నచ్చదని సత్యశ్రీ పేర్కొన్నారు. మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్నో వచ్చాయని వాటిని ఆపుకుంటూ వచ్చానని ఆమె తెలిపారు. మా అమ్మమ్మ షూటింగ్ కు పెళ్లిచూపులు తీసుకొచ్చిందని సత్యశ్రీ వెల్లడించారు. ఒక వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి షూటింగ్స్ లొ పాల్గొనవద్దని చెప్పడంతో నేను సీరియస్ అయ్యానని ఆమె అన్నారు.
నా పేరెంట్స్ నాకు షరతులు విధించలేదని బయటివాళ్లు నాపై షరతులు పెట్టడం ఏమని సత్యశ్రీ అన్నారు. మా అమ్మ మంచి ఆర్టిస్ట్ కాలేదని నేనైనా అమ్మ కలను నెరవేర్చాలని అనుకున్నానని ఆమె తెలిపారు. సత్యశ్రీ (Satya Sri) రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!