వైరల్ అవుతున్న జక్వెలిన్ ఫెర్నాండజ్ యోగా వీడియోస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అప్పటి వరకూ బాలీవుడ్ ను తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. ‘సాహో’ చిత్రంలో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ కు ఈమె వేసిన డ్యాన్స్.. చేసిన గ్లామర్ షోకి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఈమెకి సోషల్ మీడియా ఫాలోయింగ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె.. తాను చేసిన ఓ యోగా వీడియోని పోస్ట్ చేసింది.

జక్వెలిన్ ఫెర్నాండజ్.. పింక్ ఫ్రాక్ ధరించి చేసిన యోగాసనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘స్ట్రెచ్ .. కీప్ తట్ స్పైన్ హెల్దీ’ అంటూ సూర్య నమస్కారాల్లో ఓ పద్దతిని ఫాలో అవుతూ.. క్యాప్షన్ పెట్టింది. దీనికి నెటిజన్లు .. ‘జక్వెలిన్ ఈజ్ సో హాట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈమె మరో వీడియో కూడా పెట్టింది. శ్వాసను పీల్చుకుంటూ ఉన్న ఈ వీడియోకి.. ‘ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకుని ఈ పద్దతిని ఫాలో అవ్వండి’ అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టింది. ఈమె ఇంత ఫిట్ గా.. గ్లామర్ గా ఉండడానికి బహుశా ఈ ఆసనాలే కారణమేమో. ఈ వీడియోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus