ఒకప్పుడు జగపతి బాబు – సౌందర్య జంటకు సినీ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ యే వేరు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు దాదాపుగా అన్ని మంచి విజయాలే అందుకున్నాయి. అయితే అనుకోకుండా సౌందర్య అకాలమరణం సినీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం పై మాట్లాడుతూ జగపతిబాబు ఎమోషనల్ అయ్యారు.
ఆ ఫోన్ కాల్ నా జీవితంలోనే మర్చిపోలేని క్షణం అంటూ చెప్పుకొచ్చిన జగపతిబాబు. తనకు అత్యంత సన్నిహితులైన నటి సౌందర్య కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మనసు విప్పారు. తెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న , నిజ జీవితంలోనూ ఎంతో ఆత్మీయమైన స్నేహితులని తెలియజేసారు. ఈ అనుబంధం కేవలం సినిమాల వరకే కాదు, కుటుంబంతో కూడా . సౌందర్య సోదరుడు అమర్ నాథ్‌తో కూడా జగపతి బాబుకు గాఢమైన స్నేహం ఉండేది.
2004లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని, ఒక్క ఫోన్ కాల్ తనను పూర్తిగా షాక్‌కు గురి చేసిందని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. మొదట సౌందర్య మరణ విషయమే విన్నానని, వెంటనే అమర్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అనిపించిందని కానీ వైన్ దైర్యం లేక కాల్ కట్ చేసానని చెప్పారు. కానీ ఆ దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం తన జీవితంలో పెద్ద లోటుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడిచినా సౌందర్య జ్ఞాపకాలు, ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయి. జగపతి బాబు చెప్పిన ఈ మాటలు చూస్తే, వెండితెర వెనుక ఉన్న నిజమైన స్నేహాలు ఎంత బలమైనవో తెలుస్తుంది.