Guppedantha Manasu September 9th: జగతి మహేంద్రకు యాక్సిడెంట్… షాక్ లో వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేడు మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. విశ్వనాథం రీషికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పగా తాను వెళ్లడానికి ఏమాత్రం ఇష్టపడరు. నేను రాలేనని నాకు ఇంకా పని ఉందని చెప్పి రిషి ఫోన్ పెట్టేస్తారు చూశారా మేడం ఇప్పుడు నేనేం చేయాలి అని రిషి అడగడంతో వసుధారా మీరు ఇంటికి వెళ్ళండి సర్ అంటూ చెబుతుంది. రిషి నేను వెళ్లలేనని చెప్పగా లేకపోతే మా ఇంటికి రండి అంటూ పిలుస్తుంది. అక్కడికి కూడా రానని చెబుతాడు. అక్కడే అలాగే ఇద్దరు ఉండిపోతారు. మరుసటి రోజు ఉదయం జగతి మహేంద్ర కంగారుగా రిషి వద్దకు బయలుదేరుతారు. రిషి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మహేంద్ర కంగారు పడతారు. దీంతో మహేంద్ర వసుకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తారు.

వసుధార ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఏంటమ్మా ఇది ఏంజెల్ రిషి పెళ్లని విన్నాము నిజమేనా రిషి ఒప్పుకున్నారా అని మహేంద్ర అడుగడంతో లేదు సార్. సార్ పెళ్లికి ఒప్పుకున్నారని వాళ్ళు పొరపాటు పడ్డారనీ వసు చెప్పగా మరి నిజం చెప్పేయొచ్చు కదా అంటూ మహేంద్ర మాట్లాడుతారు. నిజం చెబితే ఆయన గతం గురించి చెప్పాల్సి ఉంటుంది అది సార్ కి ఇష్టం లేదు అందుకే ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పుకోలేక సర్ చాలా బాధపడుతున్నారు అంటూ వసుధార మాట్లాడుతుంది.

సార్ ఏంజెల్ ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారేమో అని అనడంతో అలా ఎలా మాట్లాడుతావు రిషి నీవాడు అంటూ మహేంద్ర చెబుతాడు. మేము ఇప్పుడే బయలుదేరాం అక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మహేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు ఓ వ్యక్తి శైలేంద్రకు ఫోన్ చేసి సర్ మీరు చెప్పినట్టుగానే కార్ బ్రేకులు తీసేసాను. నేను కూడా వారిని ఫాలో అవుతున్నాను.

ఈసారి వాళ్లను ఎవరు కాపాడలేరు అని చెప్పడంతో పని పూర్తి అయితే నేను చెప్పిన దానికన్నా ఎక్కువగానే ఇస్తాను వారిని ఫాలో అవుతూ ఉండు అంటూ శైలేంద్ర మాట్లాడతారు మరోవైపు చక్రపాణి కాఫీ టిఫిన్ ఎలా చేయగలను అమ్మ ఒకవైపు నువ్వు బాధపడుతున్నావు మరోవైపు అల్లుడు గారు అటు విశ్వనాథం గారి ఇంటికి వెళ్లకుండా ఇటు మనింటికి రాకుండా మధ్యలో బాధపడుతున్నారు మన వల్ల ఏ పాపం చేయని అల్లుడు గారికి ఇలా శిక్ష పడటం చూసి గుండె తరుక్కుపోతుంది నేను వెళ్లి ఇప్పుడే నిజం చెప్పేస్తాను అంటూ చక్రపాణి మాట్లాడటంతో మీరు చెప్పడానికి వీల్లేదు చెబితే అమ్మ మీద ఒట్టే అంటూ ఒట్టు వేస్తుంది. దాంతో చక్రపాణి కుమిలిపోతాడు నిజం చెప్పడానికి మహేంద్ర సర్ జగతి మేడం వస్తున్నారు అనడంతో చక్రపాణి కాస్త కుదుటపడతారు.

మరోవైపు జగతి మహేంద్రను ఫాలో అవుతున్నటువంటి రౌడీ బైక్ పై మహేంద్ర కారుకు అడ్డు వస్తారు బ్రేక్ వేయాలని చూడగా బ్రేకులు పడకపోవడంతో వారు వెళ్లి డివైడర్ ను గుద్దుకొని స్పృహ తప్పి పడిపోతారు. ఇక ఆ రౌడీ జగతి మహేంద్ర కారుకు యాక్సిడెంట్ అయిందని శైలేంద్రకు చెప్పడంతో శైలజ సంతోషపడతారు. అయితే కాస్త జగతికి కాస్త స్పృహ ఉండటంతో అక్కడకు వచ్చిన వచ్చినటువంటి ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకొని వసుధారకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది.

దీంతో వసుధార రిషి సార్ కి ఫోన్ చేసిన తను లిఫ్ట్ చేయరు ఇక వసుధార ఒక్కటే హాస్పిటల్ కి వెళుతుంది. మరోవైపు శైలేంద్ర తన ప్లాన్ గురించి వాళ్ళ అమ్మకు చెప్పగా వాళ్ళమ్మ సంతోషపడుతుంది ఇప్పుడు నువ్వు సరైన దారిలో వెళ్తున్న శైలేంద్ర అంటూ దేవయాని మాట్లాడుతుంది. ఒకవైపు వసుధర మరోవైపు విశ్వనాథం ఏంజెల్ ఎవరు ఫోన్ చేసిన రిషి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయరు.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus