ఖరారు అయిన జై లవ కుశ రెండో టీజర్ రిలీజ్ డేట్, టైమ్

  • August 22, 2017 / 12:22 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేగానికి యువ దర్శకుడు బాబీ ప్లానింగ్ తోడవడంతో జై లవకుశ సినిమా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేశారు. ఎడిటింగ్ పనులు తుది దశకు చేరుకోవడంతో ఎన్టీఆర్ డబ్బింగ్ మొదలెట్టారు. తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నఇందులోని నెగటివ్ క్యారక్టర్ అయిన జై కి సంబంధించిన టీజర్ గత నెల విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని హీరో పాత్ర లవ కుమార్ ఫస్ట్ లుక్ ని రాఖీ పండుగ నాడు రిలీజ్ చేశారు. ఈ లుక్ క్లాస్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ క్యారక్టర్ కు చెందిన టీజర్ వినాయక చవితికి రానున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం చెప్పింది.

తాజాగా లవ టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్ చేసింది. ఈ నెల 24న సాయంత్రం 5 గంటల 40 నిముషాలకు జై లవ కుశ రెండో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. సినిమాలో హీరో క్యారక్టర్ ఇదే కాబట్టి దీని కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus