Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు ₹600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2′(Jailer 2) రాబోతున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు.

Jailer 2

‘సన్ పిక్చర్స్’ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ‘జైలర్ 2’ ప్రమోషనల్ కంటెంట్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ.. సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం వల్ల ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 నైజాం  13.42 కోట్లు
 సీడెడ్  4.09 కోట్లు
 ఆంధ్ర(టోటల్)  12.6 కోట్లు
 ఏపీ +తెలంగాణా(టోటల్)  30.11 కోట్లు (షేర్)
 తమిళనాడు  46.8 కోట్లు
 రెస్ట్ ఆఫ్ ఇండియా  45.5 కోట్లు
 ఓవర్సీస్  78.2 కోట్లు
 వరల్డ్ వైడ్ టోటల్  200.61 కోట్లు (షేర్)

‘జైలర్ 2’ సినిమాకి రూ.281.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.285 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.36.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

అయితే మొదటి వీకెండ్(4 రోజుల్లో) ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.200.61 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.84.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే 4 రోజుల్లో రూ.30.11 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.89 కోట్ల షేర్ ను రాబట్టాలి.

పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus