Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో రజినీకాంత్‌ను నెల్సన్ ప్రెజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఓ రిటైర్డ్ జైలర్‌గా రజినీ ఆ సినిమాలో కనిపించారు. కొడుకుని చంపిన వారిని వేటాడి హతమార్చే అగ్రెసివ్ ఫాదర్‌గా కూడా మెప్పించారు. రజినీకాంత్ గత సినిమాలతో పోలిస్తే.. ‘జైలర్’లో ఆయన చాలా సెటిల్డ్‌గా కనిపించారు. అదే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది.

Jailer 2

ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని.. విడుదలైన వెంటనే మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి ఆ సీక్వెల్‌ను ‘జైలర్ 2′(Jailer 2) పేరుతో ఫినిష్ చేశారు. అక్టోబర్ 15న ‘జైలర్ 2’ రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ‘జైలర్ 2’ టీజర్, ట్రైలర్, పాటలు వంటివి ఆడియన్స్‌కి పెద్దగా కిక్ ఇవ్వలేదు.

దీంతో ‘జైలర్ 2’ రిజల్ట్‌పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్‌కి చెందిన కొంతమంది పెద్దలకి మేకర్స్ ఆల్రెడీ స్పెషల్ షో వేసి చూపించారు. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫస్ట్ హాఫ్‌లో రజినీకాంత్ ఎంట్రీ, యాక్షన్ బ్లాక్స్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అన్నీ ఆకట్టుకున్నాయట.

సెకండాఫ్‌లో ఎస్.జె.సూర్య పెర్ఫార్మెన్స్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారట. క్లైమాక్స్ అందరికీ గూజ్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందట. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus