Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌ కుమార్ కాంబినేషన్‌లో రూపొందించిన సినిమా ‘జైలర్ 2’. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయడం. మొన్నీ మధ్యే వచ్చిన ఈ సినిమాను రీరిలీజ్‌ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవును సినిమా టీమ్‌ ప్లాన్‌ అయితే అదే. అది కూడా సినిమాను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రిలీజ్‌ చేస్తున్నారట.

Jailer 2

గతంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో వచ్చిన సినిమాను కలర్‌ చేసి అందరూ రిలీజ్‌ చేస్తున్న ఈ సమయంలో ‘జైలర్‌ 2’ సినిమా టీమ్‌ మాత్రం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రిలీజ్‌ చేయాలని చూస్తోంది. ఇటీవల హాలీవుడ్‌లో వచ్చిన ‘స్పైడర్ నోయిర్’ అనే స్ఫూర్తితో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. అలా కూడా సినిమా బాగుంటుంది టీమ్‌ చెబుతోంది. ‘జైలర్‌ 2’ ప్రయత్నం విజయం సాధిస్తే మిగిలిన వాళ్లూ ఈ పని చేస్తారు. ఎందుకంటే నోస్టాలిజియా అంటారు. కలర్‌లో చూసేశాం.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో మళ్లీ చూస్తాం అంటూ ముందుకొస్తారు.

ఇక ఈ సినిమా 11 రోజుల్లోనే తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రజనీకాంత్‌ ‘2.0’ సినిమా ఎనిమిదేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును ‘జైలర్‌ 2’ బద్దలుకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల మార్కును దాటిన తొలి తమిళ సినిమాగా కూడా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా రూ.900 కోట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

తమిళంలో రూ.1000 కోట్ల సినిమాను చూడాలని అక్కడి ఫ్యాన్స్‌ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. చాలా సినిమాలు ఈ ప్రయత్నం చేసినా సాధించలేకపోయాయి.. ఇప్పుడు తలైవా ఏమన్నా ఆ పని చేసి పెడతారేమో చూడాలి. అదే జరిగితే ఈ వయసులో ఇలాంటి ఫీట్ అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇంత మంది హీరోలు వచ్చిన చేసిన సాయం వృథా పోకూడదు కదా.

ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus