‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు ₹600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రాబోతున్న సంగతి తెలిసిందే.విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అతిథి పాత్రల్లో (గెస్ట్ రోల్స్) అలరించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.

అయితే ‘జైలర్ 2’ ప్రమోషనల్ కంటెంట్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ.. ఇది సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం వల్ల భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’ థియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 16.5 కోట్లు
సీడెడ్ 5 కోట్లు
ఆంధ్ర(టోటల్) 15 కోట్లు
ఏపీ +తెలంగాణా(టోటల్) 36.5 కోట్లు
తమిళనాడు 120 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 50 కోట్లు
ఓవర్సీస్ 75 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)  281.5 కోట్లు

‘జైలర్ 2’ సినిమాకి రూ.281.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.285 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.36.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమా కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీ అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus