Jailer: రజనీకాంత్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ.. కానీ?

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ నటించిన జైలర్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమాలోని కావాలయ్యా సాంగ్ తమిళ్ వెర్షన్ కు ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ఈ మూవీపై అంచనాలను భారీ స్థాయిలో పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నాకు కూడా ఈ సినిమాతో మార్కెట్ పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తమన్నా ఒకవైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇతర భాషల్లో సక్సెస్ సాధిస్తే మరో మూడేళ్ల కెరీర్ కు ఢోకా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భోళా శంకర్ సినిమాకు కూడా బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాను మించిన సక్సెస్ ఈ సినిమాతో లభించనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ మూవీలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం. రజనీకాంత్, చిరంజీవి సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలో విడుదల కానుండటంతో తమిళనాడులో, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

ఈ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. భోళా శంకర్ మూవీ ఈవెంట్ ఈ నెల 6వ తేదీన గ్రాండ్ గా జరగనుంది. మెహర్ రమేష్ ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో మెహర్ రమేష్ మళ్లీ స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus