తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరెకెక్కిన పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ (Jana Nayakdu). వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక వివాదాలు, సెన్సార్ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల.. రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఓ దశలో ఈ సినిమా రిలీజ్ కాదేమో అని అంతా అభిప్రాయపడ్డారు.
మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి జూలై 23న విడుదల కాబోతోంది ఈ సినిమా. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ విజయ్ (Vijay) నటించిన ఆఖరి సినిమా కావడంతో.. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలో చూడాలని కొంతమంది ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. తెలుగులో కూడా ‘జన నాయకుడు’ (Jana Nayakdu) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే
| నైజాం | 0.94 cr |
| సీడెడ్ | 0.10 cr |
| ఉత్తరాంధ్ర | 0.20 cr |
| ఈస్ట్ | 0.15 cr |
| వెస్ట్ | 0.10 cr |
| కృష్ణా | 0.15 cr |
| గుంటూరు | 0.15 cr |
| నెల్లూరు | 0.10 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.89 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ | 0.07 cr |
| వరల్డ్ వైడ్ టోటల్(తెలుగు వెర్షన్) | 1.96 cr(షేర్) |
‘జన నాయకుడు’ (Jana Nayakdu) చిత్రం తెలుగు వెర్షన్ కి ప్రపంచవ్యాప్తంగా రూ.9.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.96 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.04 కోట్ల షేర్ ను రాబట్టాలి.