ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బంఫర్ గిఫ్ట్!!!

ఎన్టీఆర్ అంటే అభిమానులకు ఎంత ప్రాణమొ, ఎన్టీఆర్ అభిమానులంటే కూడా మన యంగ్ టైగర్ కి అంతకన్నా ప్రాణం. అయితే అభిమానులను అలరించేందుకు ఎన్టీఆర్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు అని ఇప్పటికీ ఎన్నో సార్లు మనం చూశాం. అయితే అలాంటి అభిమానుల స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు మరో సారో అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆ గిఫ్ట్ అంటారా…అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

విషయం ఏమిటంటే ఒక పక్క యంగ్ డైనమిక్ డైరెక్టర్, మరో పక్క మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఇంకో పక్క దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్నీ వెరసి హీరోగా యంగ్ టైగర్ అన్నీ కలగలిపితే ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”. అవును ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కు సంభందించి రంజాన్ కానుకగా మంచి విషయం ఒకటి బయటకు రానుంది అదేంటి అంటే..ఈ సినిమా తొలి టీజర్ ని రంజాన్ కానుకగా విడుదల చేసేందుకు ఎన్టీఆర్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు. అదే క్రమంలో ఫాన్స్ ఎక్కడ హర్ట్ అవకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మన యంగ్ టైగర్.

అసలే మాస్ హీరో, అందులోనూ ముస్లిం సోదరుల్లో ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక అన్నీ కలసి అదే రోజు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీజర్ బయటకు వాస్తు ఉండడంతో అభిమానులంతా రంజాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ టీజర్ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus