జనతా గ్యారేజ్ రికార్డును అడ్డుకున్న వైనం

  • October 27, 2016 / 07:13 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎదుగుదలకు  కొందరు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. అదృష్టశక్తులతో చేతులు కలిపి పరోక్షంగా దెబ్బతీస్తున్నారు. టాలీవుడ్ లో అనేక రికార్డులను తిరగ రాసిన తారక్ తాజా చిత్రం జనతా గ్యారేజ్, బుల్లి తెరపైన కూడా రికార్డులను నమోదు చేస్తుందని సినీ విశ్లేషకులు భావించారు. 53 రోజులకే మాటీవీ లో ప్రసారం అవుతుండడంతో అత్యధికమంది టీవీలకు అతుక్కు పోతారని అంచనావేశారు. టీఆర్పీ విషయంలో ఎన్టీఆర్ నంబర్ వన్ కాకూడదని ఉద్దేశంతో జనతా గ్యారేజ్ హెచ్ డీ ప్రింట్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

టీవీలో టెలికాస్ట్ అయ్యే రోజు (ఆదివారం అక్టోబర్ 23) కంటే రెండు రోజుల ముందే ఫేస్ బుక్ లో సినిమా అందుబాటులోకి రావడంతో యువత ఎక్కువగా మొబైల్స్ లోనే చూసారని తాజాగా తెలిసింది. దీంతో మాటీవీ వారు ఆశించినంతగా రేటింగ్ రాలేదు. గతంలో నాన్నకు ప్రేమతో కలెక్షన్లను తగ్గించడానికి హౌస్ ఫుల్ థియేటర్లలోనూ సినిమాను ఎత్తి వేయించారు. ఇప్పుడు టీవీలో రికార్డులకు దెబ్బకొట్టారు. దీంతో అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో జనతా గ్యారేజ్ ని లీక్ చేసిన వారిని పోలీసులకు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus