జూలై 6న జనతా గ్యారేజ్ టీజర్

  • June 23, 2016 / 10:53 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్ గా నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. నాన్నకు ప్రేమతో వంటి క్లాస్ చిత్రం తర్వాత హిట్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఫుల్ యాక్షన్ మూవీ ఇది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లగా చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్ ను జూలై 6 న విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ గురువారం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఎంతో ఓపికగా జనతా గ్యారేజ్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఆయన థాంక్స్ చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది.

యంగ్ టైగర్ రఫ్ లుక్ తో బైక్ పై పోతున్న స్టిల్, బ్యాగ్ తో కాలేజీకి వెళ్తున్న పోస్టర్ లు సోషల్ మీడియాలో లక్షల్లో లైక్లు అందుకున్నాయి. ఫస్ట్ లుక్ తో జనతా గ్యారేజ్ రికార్డులకు తెర లేపింది. జూలై 6 న రానున్న ట్రైలర్ ఎన్ని రికార్డులను సృస్టించనుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus