బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈమె సౌత్ ఎంట్రీ కోసం సౌత్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారని చెప్పాలి. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నటించడం కోసం ఎంతో ఎదురుచూసినటువంటి (Janhvi Kapoor) జాన్వీ కపూర్ ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె దేవర సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ నేను ఇదివరకు ఎన్నో సినిమాలలో నటించాను అయితే ఏ సినిమాలో కూడా నేను హీరోయిన్గా చేస్తున్నాను అని ఫీలింగ్ నాలో కలగలేదని తెలిపారు.
ఇప్పటివరకు నేను హీరోయిన్గా చేసిన ఈ సినిమాలన్నీ కూడా ఏదో వర్క్ షాప్ చేస్తున్నా అనే భావన ఉండేదని మొదటిసారి దేవర సినిమాలో నటించినప్పుడు నేను హీరోయిన్ అనే భావన నాలో కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!