దివంగత నటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి జాన్వీ కపూర్. ఇలా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ధడక్ సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఈమె ఇప్పటివరకు పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. అయితే తాజాగా ఈమె సౌత్ సినిమాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే దేవర సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి జాన్వి కపూర్ పరిచయం కాబోతున్నారు.
ఇక తాజాగా ఈమె (Janhvi Kapoor) బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన బావాల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ క్రమంలోనే ఏమైనా ఆందోళన చెందుతున్నారా అంటూ తనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు జాన్వీ సమాధానం చెబుతూ తాను ధడక్ సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే కాస్త టెన్షన్ పడ్డాను అనంతరం ఏ సినిమాల విషయంలో తనకు టెన్షన్ లేదని తెలిపారు.
ఇక సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే…ఇక్కడి అభిమానులు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు చూస్తే తనకు సొంత ఇంటికి వచ్చాను అన్న భావన కలుగుతుందని తెలిపారు. సౌత్ సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెడితే కనుక తన సొంత ఇంటికి వెళ్లానని భావన తనకు కలుగుతుందని, ఇక్కడ అభిమానులు తనపై ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు.
వారు చూపించే ప్రేమ ఆప్యాయతలను తాను నిలబెట్టుకుంటాననీ,ఎంతో కష్టపడి వారి ప్రేమను తిరిగి సినిమాల రూపంలో అందిస్తాను అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీదేవి కూడా తమిళనాడులో పుట్టి సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!