Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

  • July 15, 2024 / 09:29 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన జాన్వీ కపూర్ కు  (Janhvi Kapoor)  ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీలో సైతం ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికయ్యారు. పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాలో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ చేస్తారని ఒక వార్త జోరుగా ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర (Devara)  సినిమాలో జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో కనిపించనున్నారు.

మరోవైపు జాన్వీ కపూర్ సినిమాలో హీరోయిన్ అయినా ఆ పాత్రకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. దేవర సినిమాలో తంగం అనే పల్లెటూరి యువతి పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనున్నారు. శ్రీకాంత్  (Srikanth) కూతురిగా జాన్వీ కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు జాన్వీ కపూర్ అనంత్ అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను జాన్వీ కపూర్ షేర్ చేయడంతో పాటు తంగం అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేయడం జరిగింది.

దేవర సినిమాకు ఈ విధంగా ప్రమోషన్స్ చేస్తున్న జాన్వీ తెలివిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాలీవుడ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం. జాన్వీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus