Janhvi Kapoor: ఎన్టీఆర్ మూవీ కోసం జాన్వీ పారితోషికం ఎంతో తెలుసా?

తారక్30 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యారని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెరీర్ తొలినాళ్లలో క్లాస్ రోల్స్ లో కనిపించిన జాన్వీ కపూర్ ను కొరటాల శివ మాత్రం ఒకింత మాస్ రోల్ లో చూపించనున్నారని సమాచారం. తారక్ కు మాస్ ప్రేక్షకులలో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

తారక్ సినిమాలో మాస్ రోల్ లో కనిపించడం జాన్వీ కపూర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. శ్రీదేవి కూతురు కావడంతో తెలుగు ప్రేక్షకులు సైతం జాన్వీ కపూర్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ ఈ సినిమా కొరకు 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం. తారక్ సినిమా కావడంతో రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే తక్కువ మొత్తానికే జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

తారక్ జాన్వీ కాంబో బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు భారీ రేంజ్ లోనే బిజినెస్ జరగనుంది. 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడటం లేదు. ఈ సినిమా తారక్ కు మెమరబుల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తారక్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. తారక్ కు ఈ సినిమా కథపై ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం. తారక్ కు విలన్ గా బాలీవుడ్ హీరో ఈ సినిమాలో కనిపించనున్నారని బోగట్టా.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus