Janhvi Kapoor: ఆ మాటలు వింటే చాలా బాధగా అనిపిస్తుంది..నటి కామెంట్స్ వైరల్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరో హీరోయిన్లకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇచ్చే ఇండస్ట్రీలో అగ్ర హీరో హీరోయిన్లు ఎంతో గుర్తింపు పొందారు.ఇకపోతే నటి శ్రీదేవి వారసురాలుగా ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీకపూర్.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా ఈమె తాజా మిల్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. చాలామంది నాకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని

ఎవరికి అవకాశాలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసి రావని అలా వచ్చిన కేవలం ఒకటి రెండు సినిమాల వరకు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతామని ఈమె తెలిపారు.ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవాలంటే తప్పనిసరిగా టాలెంట్ కూడా అవసరమని వెల్లడించారు. ఇలా ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకోవడం కోసం ప్రతిరోజు తనతో తానే యుద్ధం చేస్తున్నానని

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ నెపోటిజం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈమె నటించిన మిల్లి సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా ఈమె ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus