రష్మిక మందన ప్లేస్ కొట్టేసిన జాన్వీ కపూర్

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. జూలై 26 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ డైరెక్షన్ ఆకట్టుకునే విధంగా లేదంటూ ప్రేక్షకులు విమర్శలు కురిపిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘మైత్రిమూవీ మేకర్స్’ మరియు ‘బిగ్ బెన్ సినిమాస్’ సంస్థలు కలిసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం కాన్సెప్ట్ బాగా నచ్చడంతో… విడుదలకు ముందే చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్… హిందీలో రీమేక్ చేస్తానంటూ హక్కుల్ని కూడా భారీ రేటు పెట్టి కొన్నాడు.

ఇక ఈ చిత్రంతో విజయ్ దేవరకొండని బాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్నాడట కరణ్. అంటే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ అన్న మాట కోసం కోరాడన్న మాట. కానీ ఏం.. లాభం ‘నాకిప్పుడే హిందీలో నటించే ఆలోచన లేదంటూ’ విజయ్ ఆ ఆఫర్ ని తిరస్కరించాడట. దీంతో, మొన్నామధ్య తాను నిర్మించిన ‘దఢక్’ చిత్రంలో నటించిన ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ (శ్రీదేవి తనయ) జంటను కరణ్ ఈ రీమేక్ కోసం ఎంచుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus