శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. అంటూ మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆమె కూడా తన సినిమా ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు తెలుగు సినిమా, తెలుగు సినిమా హీరోలు అంటూ చాలా ప్రేమగా మాట్లాడేస్తూ ఉంటుంది. తెలుగు హీరోలు చాలా ఇష్టమని, వారితో నటించాలని ఉంది అంటూ.. ఒకరిద్దరు హీరోల పేర్లు చెబుతూ ఉంటుంది. బాలీవుడ్ టీవీ షోస్‌కి వెళ్లినప్పుడు కూడా ఇదే మాట చెబుతూ ఉంటుంది. అయితే సినిమాలో నటించాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేస్తోంది.
జాన్వీ కపూర్ నటించిన ‘మిలీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబరు 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా జాన్వీ మీడియాతో మాట్లాడుతోంది. అందులో ఎప్పటిలాగే తనకు తెలుగు హీరోలు అంటే ఇష్టమని.. ముఖ్యంగా ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ పేర్లు చెబుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్ / ఇంటర్వ్యూలో అయితే ఎన్టీఆర్‌ను లెజెండ్‌తో పోల్చింది. దీంతో జాన్వీకి తెలుగు హీరోలంటే ఎంతిష్టమో, ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో అని పొంగిపోతుంటారు.
అయితే, ఇక్కడే ఓ విషయం మనం గమనించాలి. బాలీవుడ్ నాయికలు చాలామంది తెలుగులో నటించాక.. అప్పుడు తెలుగు హీరోల గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ జాన్వీ మాత్రం తెలుగులో నటించకుండా తెలుగు హీరోల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. దీని వల్ల ఆమెకు ఏం ఉపయోగం అనేది చూస్తే.. ఆసక్తికర విషయం తెలుస్తోంది. ‘మిలీ’ గురించి తెలుగులో మాట్లాడుకోవాలంటే సాధారణంగా కష్టం. అదే తెలుగు హీరోల గురించి మాట్లాడితే.. ఆ విషయం మీడియాలో వస్తుంది. తద్వారా తన సినిమా గురించి కూడా వస్తుంది.
ఇలా జాన్వీ చాలా తెలివిగా తెలుగు హీరోల గురించి మాట్లాడి తన సినిమాలను తెలుగు నేల ప్రమోట్ చేసుకుంటోంది అని అంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండతో, ఎన్టీఆర్‌తో నటించమని ఇటీవల కాలంలో జాన్వీ దగ్గరకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని రిజక్ట్ చేస్తూ వస్తోంది. అదే బాలీవుడ్లో ఏమైనా బిజీనా అంటే.. ఇంకా జూనియర్ స్టార్ హీరోయిన్ కూడా అవ్వలేదు. దీంతో జాన్వీ తెలుగు జపం వెనుక అర్థం ప్రమోషనే అని అంటున్నారు నెటిజన్లు.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!