హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు డైరక్షన్ టీమ్‌లో పని చేయడం అనే కాన్సెప్ట్ చాలామంది స్టార్ హీరోల వారసుల దగ్గర చూశాం. ఇప్పుడు కూడా కొంతమంది స్టార్ హీరోల వారసులు ఇలా పని చేస్తున్నారు. అయితే డైరెక్ట్‌గా డైరక్షన్ చేసిన వాడు జేసన్ సంజయ్. స్టార్ హీరో విజయ్ కొడుకు.. అనే డైరెక్ట్ పాస్ ఉన్నా.. తాను దర్శకుడిగా చేసి, సినిమా అంటే ఏంటో చూసి.. అప్పుడు హీరో అవుతా అనుకున్నాడు జేసన్. ఇప్పుడు అలా అవుతున్నాడు కూడా.
‘సిగ్మా’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన జేసన్ సంజయ్.. ఆశించిన ఫలితం అయితే అందుకోలేదు. కానీ ఆ అనుభవం అయితే అందుకున్నాడు. ఇక దర్శకత్వం అనే ఆలోచనను కొన్ని ఏళ్లు పక్కన పెట్టేసి.. విజయ్ అభిమానులు ఆశిస్తున్నట్లు హీరో అయిపోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో తొలి సినిమా ఫిక్స్ అయింది అని చెబుతున్నారు. ఈ సినిమాను ‘సిగ్మా’ సినిమాను తెరకెక్కించిన టీమే హ్యాండిల్ చేయబోతోందట.
జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ‘సిగ్మా’ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షనే ఇప్పుడు జేసన్ సంజయ్‌ను హీరోను చేస్తోందట. ఈ మేరకు అన్ని పనులు అయిపోయాయని.. త్వరలో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా దర్శకత్వంల అనే అంశంలో చాలామంది పేర్లు వినిపించాయి. సీనియర్ దర్శకుడు లింగుస్వామి పేరు బలంగా వినిపించింది కూడా.
అయితే, ఇప్పుడు మరో పేరు వస్తోంది. ఆయన కొత్త దర్శకుడు. అయితే జేసన్ సంజయ్‌కి బాగా పరిచయస్తుడు. ఎందుకంటే ఇద్దరూ కలసి ‘సిగ్మా’ సినిమాకు పని చేశారు. అంటే సంజయ్ డైరక్షన్ టీమ్‌లో ఆయన పని చేశాడు. అతని పేరు సంజీవ్. నటుడు విక్రాంత్‌కి ఆయన సోదరుడట. ఇక ఈ సినిమాకు సుమారు రూ.40 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. దర్శకుడిగా ఇబ్బందిపడ్డ సంజయ్.. హీరోగా ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో చూడాలి.