Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

‘సిగ్మా’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. కాబోయే హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు విజయ్‌ జోసెఫ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌. నిజానికి ఇలాంటి ఇంట్రోలు ఏవీ సంజయ్‌కి ఇష్టం లేదు. అందుకే తన సినిమా విషయంలో ఎవరి ప్రమోషన్‌ లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా.. తనకు తాను తీసి, ప్రచారం చేసుకుని రిలీజ్‌ చేసే పనిలో పడ్డాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ నెల 31న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే తన తండ్రి ఆఖరి సినిమా ‘జన నాయగన్‌’ సినిమా ఈ నెల 23న వస్తున్న నేపథ్యంలో థియేటర్ల పంచాయితీ వద్దనుకుని వేరే డేట్‌కి వెళ్లిపోయాడు.

Jason Sanjay

* ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసన్‌ సంజయ్‌ కొన్ని ఆసక్తికర, తన దర్శక ప్రయాణం, హీరో అయ్యే ఆలోచనల గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

* సినిమాకు ప్రచార గీతం పెట్టడం, అందులో దర్శకుడు కూడా కనిపించడం తమిళనాట చాలా ఏళ్లుగా జరుగుతోంది. అయితే ‘సిగ్మా’ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌లో జేసన్‌ కనిపించలేదు. ఎందుకు అని అడిగితే.. నటుడిగా తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలో అనేది తనకు తెలుసుని, ఇలా ఓ పాటలో కనిపించడం ఇష్టం లేదు అని చెప్పాడు.

* ‘సిగ్మా’ రిలీజ్‌ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వాలా? లేక దర్శకుడిగానే ఉండాలి అనేది ఆలోచిస్తా. అయితే దర్శకుడిగా కెరీర్‌ను కొనసాగించడానికి తన దగ్గర రెండు, మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి.

* ప్రతి దర్శకుడిలోనూ ఓ నటుడు ఉంటాడని, షూటింగ్‌ సందర్భంగా నటులకు వివరించే క్రమంలో ఆ నటుడు బయటకు వస్తాడని.. అలా తనలోనూ ఓ నటుడు ఉన్నాడని నమ్ముతున్నాను.

* తమన్‌ సంగీతానికి పెద్ద అభిమానిని. ‘ఈరమ్‌’ సినిమా నుండి ఆయన సినిమాలను ఫాలో అవుతున్నాను. తెలుగు సినిమాలు కూడా చూశాను. వాటిలో ఆయన నేపథ్య సంగీతం సూపర్‌ .

* ‘సిగ్మా’ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తమన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతంతో ఆ పాత్రలు మరింతగా ఎలివేట్‌ అయ్యాయని చెప్పాడు. ఆయన మా సినిమా చేయడం మా అదృష్టం.

* సినిమాల్లో రావాలని అనుకున్నప్పుడు తన తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు మద్దతిచ్చారు. వాళ్లు నాపై చూపించిన నమ్మకం, విశ్వాసం తనకు శక్తినిచ్చాయి.

* ‘సిగ్మా’ సినిమా లాంచ్‌ అయిన తర్వాత విజయ్‌ సేతుపతి, సూరి తదితర నటులు ఫోన్‌ చేసిన మెచ్చుకుని, తమ ఆశీర్వాదాలు అందించారు అని కూడా చెప్పాడు.

* కెనడాలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ చేసినప్పుడు ఓ 120 పేజీల స్క్రీన్‌ప్లే రాశాను. అయితే ఆ టైమ్‌లో దాన్ని సినిమాగా చేసే అవకాశం లేకపోవడంతో 20 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ చేశాను.

* షార్ట్‌ ఫిల్మ్‌ తీయడం వల్ల తన బలాలు, బలహీనతలు ఏంటి అనేది తెలిసింది. సినిమా చేసేటప్పుడు బాగా కలిసొచ్చాయి.

* పరిశ్రమలో కొంతమంది, స్నేహితులకు తన సినిమా ఆలోచనలు చెప్పి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నా. అలాంటి సమయంలో నిర్మాత తమిళ కుమరన్‌ సాయంతో లైకా సుభాస్కరన్‌ను కలిశాను. ఆయనకు ‘సిగ్మా’ కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

* మాది సినిమా కుటుంబం కావడం, చిన్నతనంలో తరచూ సినిమా షూటింగ్‌లకు, ప్రీమియర్లకు వెళ్లడం వల్ల సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది.

* నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓసారి ‘ప్రేమమ్‌’ దర్శకుడు అల్ఫాన్సే పుత్రెన్‌ ఓ కథ చెప్పారు. అయితే ఆ వయసులో సినిమా కాకుండా చదువు మీద దృష్టి పెట్టాలి అనిపించి నో చెప్పేశాను.

* ‘సిగ్మా’లో చాలా ఏళ్ల తర్వాత రాజు సుందరం మాస్టర్‌ ఓ మంచి పాత్రలో కనిపించబోతున్నారు. చిన్నతనం నుండి ఎంతో అభిమానించే నటులతో ఈ సినిమా కోసం పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.

* నేను దర్శకుడిని అవుతాను అని చెప్పినప్పుడు చాలా మంది ఓ ప్రేమకథ తీస్తాను అని అనుకున్నారు. కానీ నాకు రెండు పాత్రల మధ్య సాగే కథను సినిమా చేయడం ఇష్టం లేదు. ఓ బృందం మధ్య సాగే భారీ కథను తెరకెక్కించాలి అనిపించి ‘సిగ్మా’ తీశాను.

వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus