Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నా జీవితంలో కొత్త మలుపు ‘శరభ’ చిత్రం : జయప్రద

నా జీవితంలో కొత్త మలుపు ‘శరభ’ చిత్రం : జయప్రద

  • November 10, 2018 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా జీవితంలో కొత్త మలుపు ‘శరభ’ చిత్రం : జయప్రద

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం “శరభ”. ఎన్‌.నరసింహరావు దర్శకత్వం వహించగా ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించారు. న‌వంబ‌ర్ 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆర్‌.నారాయణమూర్తి మేకింగ్‌ వీడియోను విడుదల చేయగా, ట్రైలర్‌ను జయప్రద, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు నరసింహరావు మాట్లాడుతూ “సినిమా తీయడానికి చాలారోజులు పట్టింది అలాగే విడుదలకు కూడా. నవంబర్‌ 22న విడుదలతుండటం సంతోషంగా ఉంది. “ఎర్రసైన్యం’తో ఇండస్ట్రీలోకి వచ్చాను. నా గురువు నారాయణమూర్తి గారు ఇచ్చిన ఫౌండేషనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. భీమనేని శ్రీనివాసరావు, బాలశేఖర్‌, శంకర్‌ లాంటి గొప్ప దర్శకుల వద్ద 20 ఏళ్లు వర్క్ చేసిన అనుభవంతో ఈ సినిమా చేశాను. ఈ ఛాన్స్ ఇచ్చిన అశ్వని కుమార్‌ గారికి థ్యాంక్స్. సున్నితంగా పెరిగిన ఆకాశ్‌ను చాలా కష్టపెట్టాను. మిస్టీ చాలా బాగా చేసింది. జయప్రద గారి వంటి మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఎంత అద్భుతంగా నటించారో సినిమాలో చూడొచ్చు. ఆమె ఒప్పుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడకు థ్యాంక్స్. కోటి, రామ్‌ లక్ష్మణ్‌, చంటి గారు వంటి పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వారిందరికీ పేరుపేరున థ్యాంక్స్. చదలవాడ శ్రీనివాసరావుగారికి, నా కోసం వచ్చిన నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు” తెలియజేశారు.

నిర్మాత అశ్వని కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. “సిన్సియర్‌ ఎఫర్ట్‌తో ఈ సినిమా రూపొందించాం. జయప్రద గారు నటించడం సంతోషంగా ఉంది. నవంబర్‌ 22న విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులు ఈ సినిమా ఆదరస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో ఆకాష్ కుమార్ మాట్లాడుతూ.. “ఇలాంటి మంచి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరోయిన్‌ మిస్టీ చక్రవర్తి మాట్లాడుదూ “మా అందరికీ ఇది స్పెషల్ మూమెంట్. చాలా కష్టపడి ఈ సినిమాకు వర్క్ చేశాం. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఆకాశ్‌కు ఇది తొలిచిత్రం. అతనకి నా బెస్ట్ విషెస్. ఇలాంటి సినిమాలో ఓ భాగం అయినందుకు ఆనందంగా ఉంది. టెక్నీషియన్స్ అందరి సహకారం లేకుండా ఇలాంటి సినిమాలు చాలా కష్టం. అందరికీ థాంక్స్.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “నేను ఈ సినిమా ఫీల్డ్‌లో పుట్టడానికి కారణం కేవలం జయప్రద గారే. నేను తెనాలిలో ఏమీ లేని స్టేజ్‌లో నేల టికెట్‌ చూసే రోజుల్లో ఆవిడ “సీతారాములు’ సినిమా చూశాను. ప్రపంచంలో ఇంత అందమైన లేడీని ఎక్కడా చూడలేదు. నా జన్మలో ఎప్పటికైనా ఈమెతో ఓ సినిమా తీయాలి అని ఫ్రెండ్స్ తో చెప్పాను. ఈ మాట జయప్రదగారితో కూడా ఇప్పటివరకూ చెప్పలేదు. ఆరోజు చెప్పినట్టుగానే ఫస్ట్ సినిమా ఆమెతోనే చేశాను. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన గ్రేట్‌ ఆర్టిస్ట్ జయప్రద గారు. ఆమె నటించిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. నిర్మాత ఎంతో ఖర్చుపెట్టారు. ట్రైలర్‌ చూస్తుంటే మంచి ఓపెనింగ్స్ వచ్చే సినిమాలా అనిపిస్తోంది. రిలీజ్‌ తర్వాత సక్సెస్‌ మీట్‌కు నన్ను మళ్లీ పిలిచేలా విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ “సినిమా ఆలస్యమవుతోంది, రిలీజ్‌ అవుతుందా అని చాలామంది అపోహపడ్డారు. శంకర్‌ సినిమా “2.ఒ”నే గ్రాఫిక్స్ డిలే వల్ల వాయిదాల మీద వాయిదాలు పడింది. . ఈ సినిమా కూడా గ్రాఫిక్స్ వల్లే ఆలస్యమైంది తప్ప మరొకటి కాదు. శంకర్‌కు ఈ సినిమా డైరెక్టర్‌ నరసింహారావు శిష్యుడు. ప్రారంభంలో నా వద్ద మూడు సినిమాలకు వర్క్ చేశాడు. నీలో టాలెంట్ ఉంది నాలాంటి సినిమాలు అందరూ తీయరు నువ్వు బయటకి వెళ్లి ట్రై చేయమంటే వెళ్లాడు. ఇటీవలే ఈ సినిమా చూశాను. గొప్ప సినిమా తీశాడు. కథను, దర్శకుడిని నమ్మి రూ.20 కోట్లు పెట్టి ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్‌కు హ్యాట్సాప్‌.
జయప్రద గారి క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. నా కాలేజ్‌ డేస్‌లోనే జయప్రద గారు పెద్ద హీరోయిన్‌. రంభ, ఊర్వశి, మేనక పేర్లు మాత్రమే విన్నాం. భూతలంపై అలాంటి అందమైన వాళ్లెవరైనా ఉన్నారంటే ఆవిడే జయప్రద. ఈ మాట నేనో మీరో చెప్పింది కాదు ద గ్రేట్‌ డైరెక్టర్‌ సత్యజిత్‌రే అన్న మాటలివి. తెలుగు నుంచి వెళ్లి నార్త్‌లో సక్సెస్‌ అయిన ఏకైక హీరోయిన్‌ జయప్రద గారు. కమిట్మంట్‌ ఉన్న నటి, గొప్ప పొలిటీషియన్ ఆమె. ఆవిడ వయసెంతో తెలీదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ కూడా హీరోయిక్ గా ఉంది. అన్ని అంశాలు అద్భుతంగా కుదిరాయి. సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ‘బాహుబలి’ తమ్ముడిలా ఆడాలని, శంకర్‌ శిష్యుడిగా నరసింహ గొప్ప డైరెక్టర్‌ అవ్వాలని కోరుతున్నా. ఏ సినిమా అయినా సక్సెస్‌ తర్వాత వచ్చే పేరు హీరోకే. ఈ సినిమాతో ఆకాశ్‌కు ఆ పేరు రావాలని ఆశిస్తున్నా.

జయప్రద మాట్లాడుతూ.. “తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీనే నన్ను ఇంతదాన్ని చేసింది. ఎప్పటికీ ఈ రుణాన్ని తీర్చుకోలేను. మళ్లీ జయప్రదగా తెలుగు బిడ్డగానే నన్ను పుట్టించాలని దేవుడుని కోరుకుంటున్నాను. అశ్వని కుమార్‌ గారిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. పెద్ద బిజినెస్‌మేన్‌ అయిన ఆయన దుబాయ్‌లో మహారాజులా ఉండొచ్చు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోను పరిచయం చేయాలనే ఒక ధైర్యంతో తనకొడుకు ఆకాశ్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు. పాటలు, ఫైట్స్‌ లాంటివి తెలియని సున్నితమైన ఆకాశ్‌తో “శరభ” లాంటి భారీ చిత్రం రూపొందించిన మా దర్శకుడు నరసింహ గారికి నా హ్యాట్సప్‌. ఇక హీరోయిన్‌ మిస్టీ చక్రవర్తి… బెంగాలీలో మిస్టీ దహీ అంటే స్వీట్‌ కర్డ్‌. ఈ మిస్టీ కూడా ఎంతో స్వీట్‌. ఆమె నవ్విందంటే అందరూ అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు. భారీ గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమాలో తల్లి కొడుకు అనే ఎమోషన్‌ను ఇమడ్చటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. మీరు బాహుబలి చూసుంటారు. అరుందతి చూసుంటారు. శరభ లాంటి సినిమాలు రావడానికి కూడా ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. ఇలాంటి చిత్రాలను ధైర్యం చేసి నిర్మించడం నరసింహా వంటి దర్శకుడికి మొదటి ఛాన్స్ ఇవ్వడం అనేది నిర్మాత గొప్పతనం. ప్రజలు దీన్ని ఆదరిస్తారనే గొప్ప ధైర్యం నాకుంది.

చదలవాడ శ్రీనివాసరావు గారు స్నేహానికి ప్రతీక. పాతికేళ్లుగా ఆయనతో పరిచయం. ఫోన్‌ చేయగానే ఆయన ఈ సినిమాను రిలీజ్‌ వరకూ తీసుకొచ్చారు. నేను పెద్ద హీరోయిన్‌ను అనే భావనతో అంతా మాట్లాడారు ధన్యవాదాలు. కానీ ప్రతీ సినిమా నా జీవితంలో ఒక పరీక్ష. పాలిటిక్స్‌ నుంచి సినిమాల్లోకి రీఎంట్రి ఇద్దామనుకున్నప్పుడు ఇండస్ట్రీలో పాత పరిస్థితులు లేవు. ఇప్పుడు అంతా కొత్తవారే. అందుకే నేనూ ఓ కొత్తమ్మాయి తరహాలో ఇంట్రడ్యూస్‌ అవుతున్నాను. నా జీవితంలో కొత్త మలుపు శరభతో స్టార్ట్ అవుతోంది కాబట్టి నన్ను ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరుతున్నాను’ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jaya Prada
  • #Sharabha Movie

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

4 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

7 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

8 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

14 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

7 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

7 hours ago
శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

8 hours ago
Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version