Aarti Ravi: ఆయనకు ఆస్కార్ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్ వైరల్
- September 11, 2026 / 06:02 PM ISTByFilmy Focus Desk
సినిమా పరిశ్రమ పెళ్లిళ్లు, రిలేషన్స్ ఎంత కాస్ట్‌లీగా, అందంగా ఉంటాయో.. విడాకులు, విడిపోవడాలు అంతే వైల్డ్‌గా ఉంటాయి. విడిపోవడానికి ముందు, విడిపోతామని చెప్పిన తర్వాత, విడిపోయాక చేసే వ్యాఖ్యలు అంతే ఇబ్బందిగా ఉంటాయి. దీనికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఓ హీరోయిన్ అయితే తన భర్తను, తనను ఒక గదిలో ఉంచితే పక్కన కత్తులు ఉండకూడదు అంటూ వైరల్ కామెంట్లు చేసింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరో హీరో భార్య ‘ఆ వ్యక్తికి ఆస్కార్ ఇవ్వాలి’ అంటూ కామెంట్లు చేసింది.
Aarti Ravi
తమిళనటుడు జయం రవి భార్య ఆర్తి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఆర్తి తాజాగా ఓ నోట్ షేర్ చేశారు. ‘‘సూర్య, అజిత్, విక్రమ్, కమల్ హాసన్.. వీళ్లందరి కంటే నా జీవితంలోకి వచ్చి ఒకరు నటించిన నటనకి ఆస్కార్ అవార్డు ఇచ్చేయొచ్చు’’ అని అందులో రాశారు. ఇది జయం రవి గురించే అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇద్దర మధ్యలో రీసెంట్‌గా ఏం జరిగిందో తెలిసినవారికి ఆ కామెంట్ అర్థం ఈపాటికే అర్థమై ఉంటుంది.

తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు రవి మోహన్ సమారు రెండేళ్ల క్రితం ప్రకటించాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘‘మహిళలే కరెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలైన బాధితులు పురుషులే’ అని జయం రవి చేసిన కామెంట్స్‌పై రియాక్షన్‌గానే ఆర్తి అలా ఇన్‌స్టాలో రాసుకొచ్చారు అని అర్థమవుతోంది. ‘ఒకవేళ విడాకులు రాక ముందే నేను వేరే వ్యక్తితో కలిసి ఉంటే..? అదొక అసహ్యమైన ప్రవర్తన’ అని ఆమె అనిన విషయం తెలిసిందే.
ఇక తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కొన్ని రోజుల క్రితం జయం రవికి స్నేహితురాలు (?) కెనీషా దూరమైన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన సినిమాకు ఆమె సంగీత దర్శకురాలిగా చేస్తున్నారు. ప్రముఖ నటుడు యోగిబాబు కథనాయకుడిగా జయం రవి మోహన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ నుండి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ద్వారా కెనీసా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నట్లు తెలిపారు.













