సహజనటిగా పేరొందిన జయసుధ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ఇప్పటికీ నటిస్తూనే వస్తున్నారు. అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నారో అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక కూడా అంతే బిజీగా ఉన్నారు అని చెప్పాలి.
కృష్ణగారి రెండో భార్య మరియు ప్రముఖ నటి,దర్శకురాలు, నిర్మాత అయిన విజయనిర్మల గారికి ఈమె మేనకోడలు అనే సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో జయసుధ కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే ఫిలిం మేకర్ ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి అతనితో విడాకులు తీసుకుంది ఈమె. తర్వాత నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది. 2017 లో ఆయన కూడా మరణించడం జరిగింది.
అయితే జయసుధ పై మూడో పెళ్లి రూమర్స్ కూడా వచ్చాయి. వాటిని ఆమె కొట్టిపారేయడం జరిగింది. ఆ వార్తలు రావడానికి కారణం… గత రెండేళ్లుగా ఇతని పక్కన ఓ విదేశీయుడు నిత్యం కనిపిస్తూ ఉండటం వల్లే అని చెప్పాలి. కేవలం తన బయోపిక్ కోసం ఆ విదేశీయుడు తనతో ట్రావెల్ అవుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.
దీంతో కొన్నాళ్ళు ఈ వార్తలు ఆగాయి. కానీ నిన్న జయసుధ (Jayasudha) అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలకి హాజరవ్వగా.. ఆమెతో పాటు ఆ విదేశీయుడు కూడా వచ్చాడు.దీంతో ఆమె మూడో పెళ్లి రూమర్స్ మళ్ళీ తెరపైకి వచ్చాయి. మరి ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి