స్పైడర్ మ్యాన్.. ఈ తరం పిల్లలకు ఈ సూపర్ హీరో గురించి చెబితే పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు సూపర్ హీరోల లిస్ట్‌లో ఆయన లేడు. జెన్‌జీకి కొత్త సూపర్ హీరోలు వచ్చేశారు. కానీ నిన్నటి తరం యువతకు స్పైడర్ మ్యాన్ ఎప్పుడూ స్పెషలే. ఇదే విషయాన్ని మరోసారి చేసి చూపించారు. మన దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అందుకే ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది.
‘స్పైడర్ మ్యాన్’ కొత్త సినిమా తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.8572 కోట్లు వసూలు చేసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జులై 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.9789 కోట్లు వసూలు చేసింది. ఈ సాలెపురుగు హీరో గురించి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో. ప్రపంచంలోనే కాదు మన దేశంలోనూ ఇదే పరిస్థితి ఎందకంటే ఫస్ట్ వీకెండ్‌లో రూ.300 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది. సుమారు రూ.2,100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రెండో అతిపెద్ద ఓపెనింగ్ అందుకున్న సినిమాగా నిలిచింది.
2019లో వచ్చిన ‘అవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ ఫస్ట్ వీకెండ్‌లో రూ.11 వేల కోట్లు సాధించి ఈ లిస్ట్‌లో ప్రథమ స్థానంలో ఉంది.‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమాలో కాస్త భావోద్వేగాలు ఎక్కువయ్యాయి అనే మాట వినిపిస్తున్నా.. జనాలు అయితే వర్షాలను కూడా లెక్క చేయకుండా సినిమా కోసం థియేటర్లకు వెళ్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు అంటే ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ (రూ.18,319 కోట్లు), ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ’ (రూ.10,789 కోట్లు) ఉన్నాయి.
ఇప్పుడు ఈ ‘బ్రాడ్ న్యూ డే’ వచ్చి చేరింది. ఇదంతా చూస్తుంటే వసూళ్ల లిస్ట్‌లో ఈ సినిమా టాప్‌లోకి రావడం పెద్ద విషయం కాదు అనిపిస్తోంది. సినిమాలో నెక్స్ట్ పార్ట్ ‘స్పైడర్ మ్యాన్: బియాండ్ ది స్పైడర్ వెర్స్’ వచ్చే ఏడాది జూన్‌లో రానుంది.