రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ మూవీ మే 20న అంటే రేపు విడుదల కాబోతుంది.లలిత్ ఈ చిత్రానికి దర్శకుడు అని ప్రకటించినప్పటికీ చివరికి జీవిత రాజశేఖర్ కంప్లీట్ చేశారు. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముత్యాల రాందాస్ ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను చేపట్టారు. ఇక ‘శేఖర్’ ప్రమోషన్లలో భాగంగా జీవిత గారు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
జీవిత రాజశేఖర్లు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. మొన్నటికి మొన్న ఓ ఫైనాన్సియర్ కూడా జీవిత రాజశేఖర్ల పై సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె పలికిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నా పై వచ్చినన్ని వార్తలు వేరే వాళ్ల మీద రావేమో. మొన్నటికి మొన్న నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్ళిపోయిందని ప్రచారం చేశారు.
కొంతమంది శివాత్మిక అని,మరికొంతమంది శివానీ అని ఆ వార్తని మరింత వైరల్ చేశారు. కానీ లోపల రాసుకున్న దానికి సంబంధమే లేదు ఉండదు కూడా.మేము మా ఫ్యామిలీ అంతా కలిసే దుబాయ్‌కు వెళ్లాం. కానీ నా కూతురు ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయిందని ప్రచారం చేసేసారు. ఇలా అసత్యాలు ప్రచారం చేయడం వల్ల చాలామంది జీవితాలు పై అవి ప్రభావితం చేస్తాయి.
‘గరుడ వేగ’ మూవీ వివాదం కోర్టులో ఉంది. ఇంకా తీర్పు రాక ముందే ఏదేదో చెప్పేస్తున్నారు. మేము నిజంగా తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, మేము ఏమీ అనము. కానీ ఇలా లేని పోని ప్రచారాలు చేయకండి’ అంటూ జీవిత చెప్పుకొచ్చింది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!